- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగకైనా పైసలు ఇవ్వండి
దిశ, మర్రిగూడ: ప్రాజెక్టులో భూములు కోల్పోయాం.. పంటలు కోల్పోయాం.. వర్షపు నీటికి ఇళ్లు జలమయమయ్యాయి. పండుగ పూటనైనా మాకు ఆర్థిక సహాయం అందించి సహకరించాలని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వాసితులు కాంట్రాక్టర్‌ను వేడుకుంటున్నారు. బుధవారం నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం భూనిర్వాసితులు ప్రాజెక్టు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏడేళ్ల క్రితం పంట భూములను తీసుకొని పూర్తిస్థాయిలో భూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. బలవంతంగా మమ్ముల్ని మభ్యపెట్టి మట్టి ఎత్తుకుపోయి పంటలు చేసుకోవడానికి వీలు లేకుండా చేశారని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు వేసిన పంటలు సైతం నీటమునిగాయని, ఇళ్లల్లోకి సైతం నీరు రావడంతో తాము రాత్రింబవళ్లు కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. పండుగ పూటనైనా పిల్లాపాపలను సంతోషంగా చూసుకుందామంటే పైసలు లేవని, ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు.