- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MRO ఆఫీసులో పాస్ బుక్కుల దందా..? కూతురి పెళ్లి కోసం ఉంచిన భూమి మాయం!
దిశ, మణుగూరు : రైతులను ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్నది భూమి సమస్య. రైతే రారాజు అని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు చెబుతున్నా వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో రైతు భూమిని ఇతరులకు పట్టా చేయడం మాములు అయిపోయింది. సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినా.. రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్ల రూపంలో దౌర్జన్యం మాత్రం ఆగడం లేదు. రెవెన్యూ అధికారులు అవినీతికి అలవాటు పడి భూమి హక్కుదారులను మోసం చేస్తూ ఇతరుల పేరు మీద మార్పిడి చేయించి కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు.
వివరాల్లోకివెళ్ళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మడికొండ గ్రామం కామిశెట్టి రామారావు తండ్రి నరసయ్య అనే వ్యక్తికి సర్వే నెంబర్ 190/355/1 రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఉంది. తనకు వారసత్వంగా తన తాత, ముత్తాతల నుండి ఈ భూమి వచ్చిందిని భూ హక్కు దారుడు పేర్కొన్నాడు. తన కూతురు పెళ్లి నిశ్చయమైన సందర్భంగా పెళ్లి ఖర్చులకు భూమి అమ్మకం కోసం అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. అయితే, అక్కడకు వెళ్లాక భూ యజమానికి దిమ్మతిరిగే విషయం తెలిసింది. భూ హక్కుదారుడి పేరు మీద ఉన్న భూమి మాయం అయ్యింది. అది కాస్తా వేరొక వ్యక్తి పేరు మీదకు బదలీ జరిగింది. తన ప్రయేయం లేకుండా భూమి వేరొక వ్యక్తి పేరు మీదకు ఎలా బదిలీ చేశారంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీనిపై తహసీల్దార్‌కు ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని భూ హక్కుదారుడు వాపోయాడు. భూమి అమ్మకుండానే రామారావు అనే వ్యక్తి పేరు మీదకు పట్టా ఎలా మార్పిడి చేశారని రెవిన్యూ అధికారులను పలుమార్లు ప్రశ్నించాడు. తన కూతురి జీవితం మొత్తం ఆ భూమిపైనే ఆధారపడి ఉందని.. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తనపేరు మీదకు పట్టా మార్చి ఇవ్వాలని కోరుతున్నాడు.