- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు బూస్ట్ దొరికింది. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం (28 డిసెంబర్ 2021) కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రియాంక గాంధీ సమక్షంలో సునీల్ శాస్త్రి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శాస్త్రికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ప్రియాంక గాంధీ ట్వీట్టర్ వేదికగా “కాంగ్రెస్ సైనికుడు, భారత మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు శ్రీ సునీల్ శాస్త్రి గారిని ప్రేమతో కలవడానికి కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం కంటే మంచి సందర్భం ఏముంటుంది.” అంటూ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సునీల్ శాస్త్రి మాట్లాడుతూ.. ప్రస్తుత యూపీ రాజకీయాలపై అన్నీ విషయాలు చర్చించామని, కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
कांग्रेस स्थापना दिवस से बेहतर क्या मौका हो सकता था कि कांग्रेस के सिपाही व भारत के पूर्व प्रधानमंत्री श्री लाल बहादुर शास्त्री जी के बेटे श्री सुनील शास्त्री जी से सप्रेम भेंट कर तमाम विषयों पर चर्चा की।
देश के लिए मिलकर लड़ेंगे, जीतेंगे pic.twitter.com/NKZBaFokXK
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 28, 2021