అసెంబ్లీ ఘటన: NTR వారసులు మూర్ఖులు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-11-20 06:00:21.0  )
అసెంబ్లీ ఘటన: NTR వారసులు మూర్ఖులు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క: రాజకీయ చరిత్రలోనే ‌మహానుభావుడు ఎన్టీఆర్‌ అని.. ఆయన వారసులు ఎందుకు ‌ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటన‌, చంద్రబాబు ఆవేదన‌పై శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ముఖ్యంగా బాలయ్య బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. అసలు భువనేశ్వరిని ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు చెబితే నమ్మడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని చురకలు వేశారు.

నిజానికి ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చావుకు కారణం చంద్రబాబు అయినప్పటికీ, తనను మోసం చేశారని ఎన్టీఆర్‌ ఎంత చెప్పినా అప్పట్లో కుటుంబ సభ్యులు వినలేదని విమర్శించారు. వైఎస్సార్‌ ఫ్యామిలీ‌‌పై అసత్య ప్రచారం, జగన్‌ను జైలులో పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు. అటువంటి వ్యక్తి మాటలు అసలు బాలయ్య బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు నమ్ముతున్నారని.. ఆ దుర్మార్గుడి మాటలు నమ్మడం తనను బాధించింది అంటూ లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరం: నందమూరి సుహాసిని

చంద్రబాబుకు అవమానం.. మద్దతుగా హెడ్ కానిస్టేబుల్ రాజీనామా

Advertisement

Next Story