చైనా వాస్తవాధీన రేఖ వెంట రూల్స్ ఛేంజ్ : మంత్రి జై శంకర్

by Shamantha N |
చైనా వాస్తవాధీన రేఖ వెంట రూల్స్ ఛేంజ్ : మంత్రి జై శంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో ఇన్నిరోజులు అమలవుతున్న రూల్స్‌కు కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. కొత్తగా తీసుకున్న నిర్ణయంతో మన జవాన్లు ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ ఆయుధాలు వినియోగించవచ్చు. 1962 ఇండో చైనా వార్ తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాల వినియోగం ఉండరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజాగా దానిని అడ్డంపెట్టుకుని గాల్వాన్ లోయలో మనోళ్లపై చైనా సైనికులు కర్రలు, రాళ్లు, ముళ్ల కంచెలతో తయారుచేసిన ఇనుప రాడ్లతో దాడి చేసి చంపారు. అది గ్రహించిన మనఆర్మీ ఉన్నతాధికారులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో నాటి రూల్స్‌ను మారుస్తు నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో కూడా మన సైనికులు ఆయుధాలు వినియోగించేలా పూర్తి స్వేచ్చ నిచ్చింది. గాల్వాన్ ఘర్షణ సమయంలో మన వాళ్ల వద్ద ఆయుధాలు ఉన్నా ఏళ్లుగా వస్తున్న అలవాటు మేరకు వినియోగించలేదని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్‌ఏసీ వెంబడి రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్‌లో మార్పులు చేశారు. ఇకమీదట ఏ మాత్రం కొంచెం తేడా జరిగినా మన కమాండర్లు వెపన్స్ వాడుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed