24 గంటల్లోనే సింగరేణిలో మరో ప్రమాదం..

by Sridhar Babu |
labour injured
X

దిశ, పెద్దపల్లి : 24 గంటల వ్యవధిలోని సింగరేణి బొగ్గుగనిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న మంచిర్యాల జిల్లా ఆర్కే-7లో సైడ్ వాల్ కూలి ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే,24 గంటలు గడువక ముందే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ ఇంక్లైయిన్ బొగ్గు గనిలో సైడ్ వాల్ కూలి గుంపుల శ్రావణ్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉదయం షిప్ట్‌లో మూడవ సీమ్, 32 లెవల్ 13 డీప్ వద్ద శ్రావణ్, బాల గంగధర్ అనే కార్మికులు పైకప్పు కింద ఉన్న దిమ్మెలను తీస్తుండగా అకస్మాత్తుగా సైడ్ వాల్ కూలి శ్రావణ్ అనే కార్మికుని పై బొగ్గు పెల్లలు పడ్డాయి. వెంటనే శ్రావణ్‌ను బొగ్గు పెల్లల నుంచి బయటకు తీసి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగరేణి అధికారులు రక్షణ చర్యలు విస్మరించడం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed