- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి పనిలో సన్ స్ట్రోక్..కూలీ మృతి
దిశ, మెదక్: ప్రాణాంతక కరోనాకు దొరకకుండా అన్ని జాగ్రత్తలు పాటించి బతుకీడుస్తున్న కూలీపై భానుడు ప్రతాపం చూపించాడు. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడిన కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని కల్పించాయి. తీరా ఉపాధి దొరికి నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుందామనుకునేలోపే మృత్యువు వడదెబ్బ రూపంలో కబళించింది. వివరాల్లోకివెళితే..సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన చింతమడక నారాయణ (60) ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉపాధి పనులకు వెళ్లి ఎండదెబ్బ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానిక కూలీలు వెంటనే 108కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించేలోపే అతను ప్రాణాలు కోల్పొయాడు.ఈ మేరకు మృతుని కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు, స్థానిక ఎంపీటీసీ సుతారి నర్సింలు, కానుగంటి శ్రీనివాస్, మల్లయ్య, అల్లిబిల్లి కుమార్, స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.