కేసీఆర్‌కు ప్రమాదం.. రమణ అంటున్నరు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్ష నేత ఎల్ రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సరిగా స్పందించడంలేదన్నారు. సీఎం ఉండగా కేబినెట్ మంత్రులు సమావేశం పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ప్రమాదంలో ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15న కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారా లేదా మంత్రులు ఎగురవేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆగుస్టు 15న కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రమణ డిమాండ్ చేశారు.

Advertisement