- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఢిల్లీ కింగ్ ఎల్జీనే
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ మీద కేంద్ర ప్రభుత్వ ‘అనధికారిక పెత్తనం’ అధికారికంగా అమల్లోకి వచ్చింది. మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఇకపై ఢిల్లీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్ట్‌నెంట్ గవర్నరే. పాలనకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ముందుగా దానిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. శాసనసభకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే 15 రోజుల ముందుగానే దానిని ఎల్జీకి తెలియజేయాలి.
గతనెలలో లోక్‌సభ సమావేశాల సందర్భంగా ఈ వివాదాస్పద బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌తో ఏప్రిల్ 27 నుంచి ఈ బిల్లు అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఎడమోహం పెడమొహంగా ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎల్జీల మధ్య ఈ బిల్లు ఇంకెన్ని చిచ్చులు పెడుతుందోనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.