- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యుల నిర్లక్ష్యం.. కరోనా వ్యక్తికి సాధారణ అంత్యక్రియలు
కర్నూలులో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించడం కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే… పాణ్యంకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి హృద్రోగ సమస్యతో ఈనెల 1వ తేదీన కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
దీంతో ఆయన శాంపిల్స్ కరోనా టెస్టుకి పంపించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఫలితాలు వచ్చేలోపు ఆయన మృతి చెందారు. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన మృతదేహం తీసుకునేందుకు బంధువులు తటపటాయించగా.. మరేం ఫర్వాలేదని వైద్యులే ధైర్యం చెప్పారు. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఇంతలో ఆయనకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వచ్చి, ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో ఆయనకు వైద్యం అందించిన 30 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు.
తొలి పాజిటివ్ కేసులో కూడా వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. రైల్వేలో పని చేస్తున్న రాజస్థాన్ యువకుడికి కరోనా సోకినట్టు బయటపడింది. అంతకు ముందు కరోనా లక్షణాలు ఉండడంతో అతనిని ఐసోలేషన్ వార్డుకి పంపకుండా ఎమ్ఎమ్3 వార్డులో ఉంచి చికిత్స అందించారు. చివరకి అతనికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు, సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది. దీంతో వారందరికీ కరోనా పరీక్షలు చేయించారు. కొందరికి నెగిటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Tags: coronavirus, covid-19, kurnool, doctors negligence, corona treatment