కుప్పం వైసీపీ ఇంచార్జ్ కన్నుమూత

by srinivas |
కుప్పం వైసీపీ ఇంచార్జ్ కన్నుమూత
X

అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ చంద్రమౌళి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతి పట్ల సీఎం జగన్, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మ‌ృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన చంద్రమౌళి.. చంద్రబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరగా, ఆయన తరఫున వైసీపీ నాయకులే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

Tags: kuppam ycp incharge, chandramouli, dead, hyd

Advertisement

Next Story

Most Viewed