రహస్య వివాహం చేసుకున్న స్టార్ నటి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

by Shyam |
రహస్య వివాహం చేసుకున్న స్టార్ నటి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘కుండలి భాగ్య’ సీరియల్ ఫేమ్ శ్రద్ధా ఆర్య మొత్తానికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఢిల్లీకి చెందిన నావికాదళ అధికారి రాహుల్ నాగ్‌పాల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే మ్యారేజ్‌కు ముందు అభిమానులు, మీడియాకు ఎలాంటి సమాచారమివ్వని భామ.. పెళ్లి పూర్తయ్యాక సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేయడంతో తెగ వైరల్‌ అయ్యాయి. ఆమెను పెళ్లి దుస్తుల్లో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఇంతకుముందు జయంత్ రెడ్డి అనే ఓ ఎన్నారైతో శ్రద్ధాకు ఎంగేట్‌మెంట్ జరిగినా పెళ్లిపీటల వరకు రాలేకపోయింది. ఈ కారణంగానే శ్రద్ధ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో తన భర్తతో కలిసి అదిరిపోయే పోజులిచ్చింది. పెళ్లి రోజున శ్రద్ధా ఎరుపు రంగు లెహంగాను ధరించగా.. రిసెప్షన్‌లో బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో చీరలో మెరిసిపోయింది. ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రేణు టాండన్ బహుమతిగా ఇవ్వడం విశేషం.

ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు నటి టీవీ గ్యాంగ్ ‘కుండ‌లీ భాగ్య’ ఫేమ్‌ అంజుమ్ ఫ‌ఖీ, సుప్రియ శుక్లా, ‘బాలికా వ‌ధు’ న‌టుడు శశాంక్ వ్యాస్ స‌హా త‌దిత‌రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక సోషల్ మీడియాలో ఫొటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శ్రద్ధకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తెలుగులో ‘గొడవ’, హిందీలో ‘మే ల‌క్ష్మీ తేరే అంగాన్ కీ’, ‘తుమ్హారీ పాఖీ’, ‘డ్రీమ్ గ‌ర్ల్’ వంటి ధారావాహిక‌లతో పాటు ‘నాచ్‌ బలియే’ లాంటి రియాలిటీ షోలు, పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రద్ధ.

Advertisement

Next Story