- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మిషన్-5151’ భారతీయులకు స్ఫూర్తి : కిషన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) సంస్థ ‘కుంభ్‌సందేశ్ యాత్ర’ పేరుతో తలపెట్టిన ‘మిషన్-5151’ భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న సందర్భంగా అందుకు ఆహ్వానించేందుకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ స్టే్ట్ చీఫ్ బండి సంజయ్‌ను జీకాట్ ప్రతినిధుల బృందం కలిసింది. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సాహిత్యం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కుంభ్‌సందేశ్ యాత్ర భారతదేశానికే గర్వకారణమన్నారు. కరోనా సంక్షోభంలో భారతీయుల విజ్ఞాన ప్రతిభ ప్రపంచ నలుమూలలకు తెలిసిందన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ యాత్రకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం ఆలయం వంటిదని కొనియాడారు. రీ ఇమాజినింగ్ ఇండియా యాజ్ గ్లోబల్ పార్లమెంట్ థీమ్‌తో దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టడం చాలా గొప్ప విషయమని అభినందించారు. వారిని కలిసిన వారిలో జీకాట్ వ్యవస్థాపకులు, కుంభ్ సందేశ్ యాత్ర నిర్వాహక కార్యదర్శి ఢిల్లీ వసంత్, యాత్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ మిషన్ 5151 శ్రీనివాస్‌రెడ్డి, అరిగె రామస్వామి మెమోరియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, జీకాట్ సీఈవో శ్రవణ్ మడప్, తదితరులు ఉన్నారు.