అలా అనుకున్నామో లేదో అంతలోనే..

by Shyam |
అలా అనుకున్నామో లేదో అంతలోనే..
X

దిశ, స్పోర్ట్స్: 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. కరాచీలో జరగాల్సిన రెండో టెస్టు కోసం హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరిన సమయంలో ఉగ్రవాదులు బస్సుపై తుపాకులు, గ్రెనేడ్లు, బాంబులతో దాడి చేశారు. కానీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో శ్రీలంక ఆటగాళ్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై ఆనాడు బస్సులో ఉన్న సంగక్కర తన అనుభవాన్ని స్కైస్పోర్ట్స్‌తో పంచుకున్నాడు. ‘ఆ రోజు హోటల్ నుంచి బస్సులో బయలుదేరాం. అందరూ సరదాగా మట్లాడుతున్నారు. ఇక్కడ వికెట్లన్నీ ఫ్లాట్‌గా ఉన్నాయి. మనకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ.. ఏదైనా బాంబు పడితే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని ఒక పేసర్ అన్నాడు. ఆ తర్వాత కొంత సమయానికై బస్సుపై దాడి జరిగింది’ అని సంగక్కర చెప్పాడు. మేమేదో సరదాగా కోరుకుంటే నిజంగానే జరిగిందని ఆనాటి భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ‘మొదట తుపాకీ శబ్దాలు మాకు వినిపించాయి. కానీ ఏవరో టపాకులు కాలుస్తున్నారని అనుకున్నాం. కానీ బస్సులో ముందున్న వ్యక్తి పడుకోండి.. మనపై దాడి జరుగుతోందని అరవడంతో అప్రమత్తమయ్యాం’ అని అన్నాడు. ఇప్పటికీ ఆ ఉగ్రదాడి నుంచి మేం భయటపడ్డామనేది కలేమోఅని అనుకుంటానని సంగాక్కర చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed