- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొహ్లీ ఆటగాళ్లను బాగా అర్థం చేసుకుంటాడు : కుల్దీప్
దిశ, స్పోర్ట్స్: క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తాను టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని చూసి నేర్చుకున్నానని.. అతను ఆటగాళ్లను బాగా అర్థం చేసుకోగలడని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. మైదానంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి.. వాటిని ఎలా ఛేదించాలో కొహ్లీ నేర్పాడని ఈ యువ స్పిన్నర్ చెప్పాడు. ఏదైనా మ్యాచ్‌లో కెప్టెన్ మనల్ని నమ్మి బౌలింగ్ అప్పగిస్తే.. అది ఒత్తిడిలా అనిపించదని, అతడి నమ్మకాన్ని నిలబెట్టాలనే కసి వస్తుందని చెప్పాడు. యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపడంలో కొహ్లీ ఎప్పుడూ ముందుంటాడని కుల్దీప్ అన్నాడు. నేను జట్టులోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొహ్లీ ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచాడని.. అతని ప్రోత్సాహాన్ని ఎప్పుడూ మరువలేనని కుల్దీప్ చెప్పాడు. మరోవైపు తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కూడా చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు. అతను జట్టుకు మళ్లీ ఆడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు.