దిక్కులు పిక్కటిల్లేలా విక్టరీ : కేటీఆర్

by Shyam |
దిక్కులు పిక్కటిల్లేలా విక్టరీ : కేటీఆర్
X

దిక్కులు పిక్కటిల్లేలా టీఆర్ఎస్ పార్టీ మరో బంపర్ విక్టరీ సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటిందని అన్నారు. ఎన్నికల్లో 90శాతానికి పైగా టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండి, మద్దతు పలికిన రైతులకు ధన్యవాదాలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story