- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘జల విప్లవం పునాదిగా రాష్ట్రంలో మరో నాలుగు’..?
దిశ, కరీంనగర్: రైతును రాజుగా చేసేందుకే నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా అప్పర్ మానేరు ప్రాజెక్ట్ను సందర్శించిన ఆయన పలు అబివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూస విధానాలకు స్వస్తి పలికేందుకే నియంత్రిత సాగు విధానం చేపట్టామన్నారు. జలవిప్లవం పునాదిగా రాష్ట్రంలో మరో 4 విప్లవాలు రానున్నాయని మంత్రి తెలిపారు.
రైతు బంధుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వానాకాలం సిరిసిల్ల జిల్లాలో అదనంగా 8 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. ప్రతి రైతుకు రైతు బంధు అందేలా చూసే బాధ్యత జెడ్పీటీసీ, ఎంపీపీలదేనని ఆయన స్పష్టం చేశారు. నరేగా పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, యుద్ధ ప్రాతిపాదికన కల్లాలు, షేడ్‌ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అలాగే, అన్ని రైతు వేదికలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించకపోతే ప్రజా ప్రతినిధులు, అధికారులపై వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.