- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ మాకు సహకరించాలి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
దిశ, పటాన్‌చెరు: గతంలో కాలుష్యానికి కేంద్రంగా నిలిచిన పటాన్‌చెరు నియోజకవర్గం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆయన కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన 100 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఎల్ఈడి వీధిదీపాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివిధ జిల్లాల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నియోజకవర్గ అభివృద్ధికి వెన్నంటి నిలుస్తున్నారన్నారు. నూతనంగా ఏర్పాటు అవుతున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే పటాన్ చెరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.