- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టు అమర్‌నాథ్ మృతికి కేటీఆర్ సంతాపం
దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కోసూరి అమర్ నాథ్ మృతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో అమర్ నాథ్ తనదైన ముద్ర వేశారని, జర్నలిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అటు, సీనియర్ పాత్రికేయుడు కోసూరి అమర్ నాథ్ మృతికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు గుత్తా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక అమర్ నాథ్ ఆకాల మృతి జర్నలిస్టులకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. మూడు దశబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. అమర్‌నాథ్ మృతి జర్నలిస్ట్ యూనియన్లకు, తెలుగు జర్నలిస్టులకు తీరని లోటన్నారు. జర్నలిస్టుల యూనియన్లకు సంబంధించి చట్టపరమైన అంశాల అన్నింటిలో నిష్ణాతుడిగా ఉండి, ట్రిబ్యునల్స్ వాటి సిఫారసుల అమలు, యాజమాన్యాల మధ్య వచ్చిన వివాదాలకు ఒక నిపుణుడిగా ఆయన విలువైన సలహాలు ఇచ్చేవారని తెలిపారు.