- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ కు వాటర్ ప్లస్ హోదా.. అభినందనలు తెలిపిన కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ హోదా పొందింది. హైదరాబాద్ ఇప్పటికే ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సిటీగా గుర్తింపు వచ్చింది. దీంతో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం అభినందనలు తెలిపారు. నగరాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా ఇండోర్ నగరం దేశంలోనే తొలివాటర్ ప్లస్ నగరంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్వచ్చ సర్వేక్షన్ అనేది నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం యొక్క వార్షిక సర్వే చేసి స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే వాటర్ ప్లస్ హోదా రావాలంటే నదులు, కాలువల్లో పరిశుభ్రత చేపట్టాలి. గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి విడుదలయ్యే మురుగును శుద్ధి చేసి అవసరాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
- Tags
- hydeabad