బీసీ కమిషన్‌ను అభినందించిన కేటీఆర్

by Shyam |   ( Updated:2021-08-27 07:18:33.0  )
Ktr2
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీల సమగ్ర వికాసం కోసం బీసీ కమిషన్ పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం కేటీఆర్‌ను నూతనంగా నియామకం అయిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూరంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని, కమిషన్ సభ్యులు కూడా అవిశ్రాంతంగా పనిచేసి ప్రభుత్వ పథకాలు అందజేసేలా చూడాలన్నారు. కమిషన్‌పై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. మంత్రిని కలిసిన వారిలో కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు సీహెచ్.ఉపేందర్, నూలి శుభప్రద పటేల్, కె.కిశోర్ గౌడ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed