చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్‌కు వినతి

by Shyam |
చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్‌కు వినతి
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోతున్నారు. కుల వృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో చేనేత కార్మికులను ఆదుకోవాలని నల్లగొండ జిల్లా నాంపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఐటీ, జౌళి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మిక కుటుంబాలు బతకడానికి నెలకు రూ.5 వేలు ఆరు నెలలపాటు జీవనభృతి అందించాలని, చేనేత మగ్గం పని చేయడానికి అవసరమైన నూలు, రంగుల రవాణాకు అనుమతి కల్పించాలని, పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed