- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది చివరికల్లా అందరికీ వాక్సినేషన్
దిశ, వేములవాడ: కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ ఏడాది చివరి కల్లా ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వేములవాడలో 100 పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే రమేష్ కోరిన నేపథ్యంలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందన్నారు. తుది దశ నిర్మాణ పనులను నెలరోజులుగా వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు.
జిల్లాలో వేములవాడ ఆసుపత్రితో కలిపి 500 పడకల స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వేములవాడ ఆస్పత్రిలో 50 పడకలతో కోవిడ్ వార్డు సిద్ధం చేశామనీ, అన్ని రకాల వైద్య సేవలతో పాటు మందులు కూడా సిద్ధం చేశామన్నారు. ఆరోగ్య సర్వేలో జిల్లాలో జ్వరం ఉన్నవారి నీ 3,900 మందిని గుర్తించి కిట్లు అందజేయడం జరిగిందన్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించేందుకు, నిరంతరం శ్రమిస్తున్న వైద్యులను ఎప్పటికీ ప్రజలు మరిచిపోరన్నారు. సిరిసిల్ల తరహాలో వేములవాడలో కూడా రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ను రానున్న 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
కరోనా వచ్చి తగ్గిన వారికి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇంకా వైద్య నిపుణులు సూచించిన మందులు, ఇతర వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ మనదగ్గరే ఉత్పత్తి చేస్తున్నా 85% కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుందని,మిగిలిన 15 శాతం లోనే రాష్ట్రాలు, ప్రైవేట్ నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.