బెంగళూరు అల్లర్లు.. ఆ పార్టీపై బ్యాన్!

by Shamantha N |
బెంగళూరు అల్లర్లు.. ఆ పార్టీపై బ్యాన్!
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ కారణంగా బెంగళూరులో మంగళవారం రాత్రి అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాధిత ఎమ్మెల్యే మేనల్లుడు పెట్టిన పోస్టు కారణంగా, పథకం ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి పై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మూకదాడికి పాల్పడి.. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్పోరేటర్‌ భర్తతో పాటుగా.. ‘సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’(SDPI), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) హస్తుమున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో కొందరు ఏకంగా పోలీసు‌స్టేషన్‌పై రాళ్ల వర్షం కురిపించడంతో దాదాపు 60 పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి చేజారే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.

అయితే, ఈ దాడులకు SDPI ముఖ్య కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ అలర్లలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రాష్ట్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారు. ఘర్షణలకు ఎస్‌డీపీఐ, పీఎఫ్ఐ పార్టీ హస్తముందని తేలడంతో ఆ పార్టీలపై నిషేధం విధించనున్నట్లు మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టంచేశారు. ఈనెల 20న జరగబోయే కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed