- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వన్డే జట్టులోకి కృనాల్.. తండ్రిని తలచుకొని భావోద్వేగం

దిశ, స్పోర్ట్స్:ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా తుది జట్టులోకి ఇద్దరు కొత్త వారికి చోటు కల్పించారు. ఇదివరకే టీ20లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యాతో పాటు ప్రసిధ్ కృష్ణ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. మ్యాచ్‌కు ముందు జరిగిన టీమ్ మీట్‌లో కృనాల్ పాండ్యాకు సోదరుడు హార్దిక్ పాండ్యా 233 నెంబర్ క్యాప్ అందించి జట్టులోకి స్వాగతం పలికాడు. తమ్ముడి చేతుల మీదుగా క్యాప్ అందుకున్న కృనాల్ భావోద్వేగానికి గురయ్యాడు. క్యాప్‌ను ఆకాశం వైపు చూపుతూ తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే పాండ్యా సోదరుల తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తన ఇద్దరు కొడుకులు టీమ్ ఇండియాకు ఆడుతుంటే చూడాలనేది వారి తండ్రి కోరిక. పఠాన్ బ్రదర్స్ తర్వాత భారత జట్టు తరపున ఆడుతున్న సోదరులు హార్దిక్, కృనాల్. ఇక గత సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసిన ప్రసిధ్ కృష్ణకు కోచ్ రవిశాస్త్రి 234 నెంబర్ క్యాప్ ఇచ్చి జట్టులోకి స్వాగతం పలికాడు.