హృతిక్‌తో కృతి?

by Shyam |
హృతిక్‌తో కృతి?
X

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌.. మొదటి నుంచి భిన్న కథాంశాలతో కూడిన సినిమాలే చేస్తున్నారు. ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో హృతిక్ హీరోగా వచ్చిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలన్నీ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందించాయి. అందుకే ఆ సిరీస్‌లో రాబోయే చిత్రం.. క్రిష్ 4 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2020 డిసెంబర్‌లో రిలీజ్ కానున్నట్లు దర్శకుడు రాకేష్ రోషన్ 2018లోనే క్లారిటీ ఇచ్చారు. కానీ క్రిష్ 4‌కు కరోనా బ్రేకులు వేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్‌డేట్స్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌లో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ‘క్రిష్ 4’ ఒకటి. కాగా, హృతిక్ రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ ఏలియన్ ఫ్రెండ్ ‘జాదూ’ ఈ మూవీలో మరోసారి కనిపిస్తున్నాడని ఇంతకుముందే తెలిసింది. అంతేకాదు ఈ చిత్రంలో హృతిక్ నాలుగు పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హృతిక్ సరసన నటించబోయే హీరోయిన్‌పై ఓ క్లారిటీ వచ్చినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక.. క్రిష్ 4లో కనిపించడం కష్టమే. అందుకే ఆమె ప్లేస్‌లో చిత్ర బృంద.. కృతి సనన్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్పిందే.

Advertisement

Next Story