నాగార్జున సాగర్‌ను సందర్శించిన కృష్ణ రివర్ బోర్డు

by Shyam |
Krishna River Board
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కృష్ణ రివర్ బోర్డ్ సందర్శించింది. బోర్డ్‌లో నూతనంగా ఎంపికైన సీఈలు టీకే.శివరాజన్, అనుపమ్ ప్రసాద్ బుధవారం ప్రాజెక్టుల పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వాక్ వే ద్వారా గేట్లను పరిశీలించిన అనంతరం రైట్ కెనాల్ తూము గేట్లు, ఫైలాన్, హిల్ కాలనీల మోటర్ పంప్ హౌస్‌లను పరిశీలించారు. డ్యామ్ పైఉన్న లిఫ్ట్ పని తీరును తనిఖీ చేశారు. సీఈలతో డిప్యూటీ ఈఈ త్రినాథ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్ఈ ధర్మనాయక్, డీఈ పరమేష్, శ్రీనివాస్, సుదర్శన్ రావు, ఏఈఈలు రవి, సత్యనారాయణ, జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed