విద్యుత్ తీగలు తగిలి విద్యార్ధి మృతి.. ఉపాధ్యాయుడే కారణమా ?

by Anukaran |   ( Updated:2021-08-25 10:19:34.0  )
student
X

దిశ, ఏపీ బ్యూరో : కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే గోపీచంద్(15) పదో తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం ఉదయం గోపీచంద్‌ను వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేయాలని ఉపాధ్యాయుడు చెప్పాడు. ట్యాంక్ ఎక్కలేకపోతుండటంతో ఉపాధ్యాయుడు విద్యార్థి గోపిచంద్‌ను పైకి ఎక్కించగా విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యలు తెలిపారు. న్యాయం చేయాలని మృతదేహంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. పోలీసులు, స్థానిక నేతలు వారికి సర్ది చెప్పడంతో విషయం సద్దు మణిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గోపిచంద్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

Advertisement

Next Story