రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకు పోవద్దు !

by srinivas |
రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకు పోవద్దు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకు పోవద్దని సూచిస్తూ కృష్ణాబోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఏపీ ప్రభుత్వానికి గురువారం లేఖ రాశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసిందని, కానీ పనులపై ముందుకు పోరాదని లేఖలో పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టరాదని తెలిపారు. వెంటనే రాయలసీమ డీపీఆర్ ఇవ్వాలని లేఖలో కోరారు.

కాగా కాళేశ్వరం మూడో టీఎంసీపై ఎన్జీటీ తీర్పు నేపథ్యంలో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం విస్తరణపై పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో ఏపీ కూడా రాయలసీమపై అదే పంథాలో ముందుకు పోతోంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కూడా పర్యావరణ అనుమతులు లేవంటూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ బెంచ్ తీర్పు కోసమే చెన్నై ఎన్జీటీ బెంచ్ రాయలసీమపై తీర్పును రిజర్వు చేసినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు భావిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరంపై తీర్పు వచ్చిన దరిమిలా రాయలసీమపై కూడా వస్తుందని, కొంతమేరకు ఏపీకి అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర జలశక్తి తరుపున బోర్డు ఏపీకి లేఖ రాసింది. రాయలసీమ పనులను చేపట్టవద్దని, ముందుగా డీపీఆర్ సమర్పించాలంటూ సూచించింది.

Advertisement

Next Story