- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్తు ఉత్పత్తి ఆపండి.. తెలంగాణకు కృష్ణాబోర్డు లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుపై కృష్ణాబోర్డు మరోసారి స్పందించింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నిరంతరం కొనసాగిస్తున్నారని, వెంటనే పవర్ జనరేషన్ నిలిపివేయాలని సోమవారం తెలంగాణకు లేఖ రాసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావుకు కేఆర్ఎండీ సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఈ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జూలై 21 నుంచి 30వరకు 54.98 టీఎంసీల నీరు వచ్చిందని, కానీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో సాగర్‌కు 32.27 టీఎంసీలను తరలించినట్లు పేర్కొన్నారు.
బోర్డు అనుమతి లేకుండా, నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిందని ఏపీ ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రాన్ని నిలిపివేయాలని లేఖలో సూచించారు. శ్రీశైలానికి వరద వచ్చినా దిగువకు వెళ్లిందని, దీంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కనీసం తాగునీరు వచ్చే అవకాశాలు లేవని లేఖలో పేర్కొన్నారు. కేఆర్ఎంబీ లేఖతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదును తెలంగాణకు పంపించారు.