- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర జలసంఘానికి కృష్ణా బోర్డు ఛైర్మన్ లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల వినియోగం అంశంలో బచావత్ ట్రిబ్యునల్ ఏడో క్లాజు అమలుకు విధివిధానాలను చూపించాలని కృష్ణాబోర్డు ఛైర్మన్ పరమేశం కేంద్ర జల సంఘానికి సోమవారం లేఖ రాశారు. గృహావసరాలకు సరఫరా చేసే కృష్ణా జలాల్లో 20వాతం మాత్రమే వినియోగ లెక్కల్లోకి తీసుకోవాలనే అంశంపై ఇరు రాష్ట్రాలు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జలాల వినియోగంలో 20శాతం వినియోగ లెక్కల్లోకి గృహావసరాలకు సరఫరా చేసే నీటిని లెక్కల్లోకి తీసుకోవాలని బచావత్ ఏడో క్లాజు అమలుకు జలసంఘం విధి విధానాలను చూపించాలని కోరారు. ఆ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల వివరాలను లేఖతో జత చేసి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను వివరించారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనిపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు లేఖలో వెల్లడించారు. గృహావసరాలు, పరిశ్రమలకు మాత్రమే వాడే నీటిని ఎలా లెక్కిస్తారని, ఇందుకు మెకానిజం (విధి విధానాలు) లేవనే అభిప్రాయాన్ని ఏపీ నీటిపారుదల శాఖ వ్యక్తం చేసిందని లేఖలో వివరించారు. ఏపీ రాసిన లేఖను కేంద్ర జల సంఘానికి పంపించారు.