6-12 ఏండ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్

by Shamantha N |
6-12 ఏండ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్
X

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 6 నుంచి 12 ఏండ్ల గ్రూపు పిల్లలకు స్క్రీనింగ్‌ను ఏయిమ్స్‌ న్యూఢిల్లీ నిర్వహిమచనుంది. ఈ మేరకు 6 నుంచి12 ఏండ్ల మధ్య గ్రూపు పిల్లలను కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసే ప్రక్రియ మంగళవారం నిర్వహించనున్నట్టు ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ఫ్రోఫెసర్ డాక్టర్ సంజయ్ తెలిపారు.

క్లీనికల్ ట్రయల్స్ కోసం 12 నుంచి 18 ఏండ్లలోపు పిల్లల ఎంపిక ఇదివరకే పూర్తయిందని తెలిపారు. వారికి సింగిల్ డోసును కూడా వేసినట్టు చెప్పారు. ఇక 6-12 ఏండ్లలోపు పిల్లల రిక్రూట్ మెంట్ పూర్తికాగానే, 2-6 ఏండ్లలోపు పిల్లలకు క్లీనికల్ ట్రయల్స్ ప్రక్రియను ఎయిమ్స్ న్యూఢిల్లీ ప్రారంభింస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed