- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన కోటక్ బ్యాంక్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. సవరించిన దాని ప్రకారం వడ్డీ రేటును ఏడాదికి 6.55 శాతనికి పెంచింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 10 వరకు అమలవుతాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు కొత్త గృహ రుణాలు తీసుకునేవారికి, బదిలీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌లో కోటక్ బ్యాంక్ పండుగ సీజన్ నేపథ్యంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.50 శాతానికి తగ్గించింది.
దీనిని పరిమిత కాల పండుగ సీజన్ ఆఫర్‌గా ఇచ్చామని, సోమవారంతో గడువు ముగిసిందని బ్యాంకు వివరించింది. అంతేకాకుండా నవంబర్ 8 నాటికి కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి గృహ రుణం మంజూరు అయినా లేదంటే నవంబర్ 15 లోగా రుణ పంపిణీ జరిగిన వారికి 6.5 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. ‘బ్యాంకు ప్రత్యేకంగా అందించిన 60 రోజుల పండుగ సీజన్ ఆఫర్‌కు వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణ లభించింది. ఇటీవల కొత్త గృహ రుణాలకు డిమాండ్ భారీగా పెరిగింది’ అని బ్యాంకు కన్స్యూమర్ అసెట్స్ అధ్యక్షుడు అంబుజ్ చందనా అన్నారు.