అచ్చెన్నాయుడికి 14రోజుల రిమాండ్

by srinivas |
అచ్చెన్నాయుడికి 14రోజుల రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కోటబొమ్మాళి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అభ్యర్థి అప్పన్నను నామినేషన్ వేయకుండా ఫోన్‌లో బెదిరించారన్న కేసులో నిమ్మాడలో ఇవాళ అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోటబొమ్మాళి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 15వరకు రిమాండ్ విధించింది. అచ్చెన్నాయుడును అంపోలులో ఉన్న జిల్లా జైలుకు తరలించారు.

అయితే అచ్చెన్నాయుడు సతీమణి నిమ్మాడలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదేక్రమంలో వైసీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు బంధువు కింజారపు అప్పన్న నామినేషన్ వేసేందుకు యత్నిస్తున్న సమయంలో అచ్చెన్నాయుడు ఫోన్ చేసి బెదిరించారన్న దానిపై కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి నిమ్మాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇప్పటివరకు పోలీసులు 12మందిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించింది.

Advertisement

Next Story