చిన్నారుల పరిస్థితి చూసి చలించిన మంత్రి కొప్పుల

by Sridhar Babu |
Minister Koppula Eshwar
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామానికి చెందిన సుంకె లత రెండేళ్ల క్రింతం అనారోగ్యంతో మరణించింది. దీంతో అనాథలైన ఆమె పిల్లలు అనన్య, విశాల్, నానమ్మ పోచమ్మ దగ్గర పెరుగుతున్నారు. అయితే, తాజాగా.. చిల్వకోడూర్ గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు స్థానిక నాయకులు వారి పరిస్థితిని వివరించారు. దీంతో పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి ఇద్దరి పిల్లల పోషణకు ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed