- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెర్రరిస్టులకూ ఓ మతం ఉంటుంది.. బాలీవుడ్ యాక్ట్రెస్
దిశ, సినిమా : 26/11 ముంబై అటాక్స్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ‘ముంబై డైరీస్ 26/11’. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్ సోషల్ సర్వీసెస్ డైరెక్టర్ చిత్ర దాస్‌గా కనిపించిన కొంకణా సేన్ శర్మ.. ఈ సిరీస్‌తోనే డిజిటల్ వెబ్ వరల్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సిరీస్ గురించి మాట్లాడిన ఆమె.. ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఏదో ఒక మతం వల్లే ఇది జరిగిందని, తప్పును వారిపై నెట్టేస్తామని అది కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఇలాంటి మైండ్ సెట్ కరెక్ట్ కాదని, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.
తీవ్రవాదులకు సొంత మతం ఉంటుందన్న ఆమె.. ఏ మతం నుంచైనా హింస పుట్టుకురావచ్చని తెలిపింది. ముంబై డైరీస్‌లో ఇలాంటి ప్రస్తావన తీసుకురాలేదన్న కొంకణ.. ట్రైలర్‌లో చెప్పినట్లుగా డాక్టర్ దేహాన్ని దేహంగా మాత్రమే చూస్తాడని, కులం మతం గురించి పట్టించుకోరని చెప్పింది. అలాగే మతం పేరుతో విడిపోకుండా భారతజాతిగా కలిసి ఉండాలని కోరింది.