- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు కొండెంగ ఫిదా
దిశ, మహబూబాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బుల్లెట్ బండి’ సాంగ్ ఓ ఊపు ఊపుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా అందరూ ఈ సాంగ్‌కు ఫిదా అయ్యారు. ఇటీవల ఓ పెళ్లి బరాత్‌లో ఈ పాటకు డాన్స్ చేసిన వధువు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడమే కాకుండా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా.. ఈ పాట మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు మనుషులను ఆకర్షించిన ఈ పాట, ఈసారి ఓ కొండెంగను ఆకర్షించింది. ఆ పాట వెంటనే ఈ కొండేంగ పాలు తాగుతోంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఓ కిరాణం షాప్ యజమాని, గ్రామంలో కోతుల బెడదను వదిలించుకునేందుకు ఓ కొండేంగను కొనుగోలు చేశాడు. దానికి ఓ పిల్ల కొండెంగ కూడా ఉంది. వారం రోజుల క్రితం అనారోగ్యంతో తల్లి కొండెంగ మృతిచెందింది. అప్పటినుంచి తల్లి పాలకు దూరమైన పిల్ల కొండెంగకు ఓ డబ్బాలో పాలు పోసి తాపించినా తాగడం లేదు. సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న ‘బుల్లెట్ బండి’ పాటను సెల్ ఫోన్లో పెట్టి దానికి వినిపిస్తూ పాలు తాపిస్తే తాగింది. అప్పటినుంచి పాట పెడితేనే పాలు తాగుతుండటం గమనార్హం. కేవలం వినడమే కాకుండా ఫోన్ చేతపట్టుకొని చూస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.