కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు..!

by Shyam |
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, టీఎన్జీవో కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story