కొమొడో డ్రాగన్‌పై వాతావరణ మార్పు దెబ్బ!

by Anukaran |
కొమొడో డ్రాగన్‌పై వాతావరణ మార్పు దెబ్బ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి, కొమొడో డ్రాగన్‌పై వాతావరణ మార్పు దెబ్బపడనుంది. సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న కొన్ని దశాబ్దాల్లో ఈ జంతువు పూర్తిగా అంతరించిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ యూనివర్సిటీ, డీకిన్ యూనివర్సిటీలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతానికి కేవలం ఐదు ద్వీపాల్లో మాత్రమే ఈ కొమొడో డ్రాగన్లు ఉన్నాయి. వాటిలో మూడు ద్వీపాల్లోని కొమొడో డ్రాగన్‌లు, ఈ దశాబ్దం పూర్తయ్యేలోపు అంతరించిపోతాయని, మిగతా రెండు ద్వీపాల్లోనివి రానున్న దశాబ్దాల్లో అంతరించిపోతాయని ఈ అధ్యయనంలో తెలిసింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను, వాటి మార్పులను పరిగణనలోనికి తీసుకుని, రానున్న కాలాల్లో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఆ మోడళ్ల ద్వారా కొమొడో డ్రాగన్‌లపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా కొమొడో డ్రాగన్లలో సంతాన వృద్ధి క్రమంగా తగ్గిపోతోందని, ఒకవేళ పుట్టినా కూడా అవి ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోవడమే ఇవి అంతరించి పోవడానికి కారణమవుతుందని పరిశోధకులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed