భూ క‌బ్జాలే ముత్తిరెడ్డి పాల‌న‌.. హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభంలో కొమ్మూరి ధ్వ‌జం

by Javid Pasha |   ( Updated:2023-03-10 16:58:29.0  )
భూ క‌బ్జాలే ముత్తిరెడ్డి పాల‌న‌.. హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభంలో కొమ్మూరి ధ్వ‌జం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని, అనేక అంశాల్లో వెన‌క‌బాటుకు గురైంద‌ని పీసీసీ స‌భ్యులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. నామినేటెడ్ ప‌దవులు, అధికారుల‌కు పోస్టింగ్‌లు, ప్ర‌భుత్వ, ప్రైవేటు వ్య‌క్తుల భూముల‌ను క‌బ్జా చేస్తున్నాడ‌ని ఆరోపించారు. స్థానికేతరుడైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగామ ప్ర‌జ‌లు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సొంత అభివృద్ధి త‌ప్పా, ప్ర‌జాప‌యోగ కార్య‌క్ర‌మాలు శూన్య‌మ‌ని అన్నారు. జ‌న‌గామ ప్ర‌జ‌లు ఆలోచ‌న చేయాల‌న్నారు. మనకు మన ప్రాంతానికి న్యాయం చేసే నాయకుడు కావాలా భూకబ్జాలు, నామినేటెడ్ పదవులు, అధికారులకు పోస్టింగ్‌లు అమ్ముకునే వ్యక్తికి రావాలో మీరు ఆలోచించుకోవాల‌న్నారు.

భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసేందుకు కొముర‌వెల్లి మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర‌ను శుక్ర‌వారం కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి ప్రారంభించారు. శుక్ర‌వారం కొముర‌వెల్లి మండ‌లంలోని కొమరవెల్లి రసూలబాద్, ఐనాపూర్ ,తపాస్పల్లి, గురవన్నపేట్, పోసాన్ పల్లి, రాంసాగర్ లో పర్యటించి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఆవశ్యకతను ప్రజలకు వివరించడం జరిగింది. ఈసంద‌ర్భంగా ఆయ‌న ప్రారంభ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిపై ధ్వ‌జ‌మెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌గామ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని, భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతూ జ‌న‌గామ ప్రాంత ప్ర‌జ‌ల ప‌రువు తీస్తున్న ఎమ్మెల్యేకు గుణ‌పాఠం చెప్పాలంటూ ధ్వ‌జ‌మెత్తారు.


కార్య‌క్ర‌మంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ జ‌డ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, ఎంపీటీసీ లింగంపల్లి కవిత-కనకరాజు,వేలాద్రి అంజిరెడ్డి, ఎంపీటీసీ కొయ్యడ రాజమని-శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వంగ కృష్ణారెడ్డి, జంగని రవి, మల్లం బాలయ్య, మల్లం శేఖర్, కాయిత మోహన్ రెడ్డి, ఏర్పుల కృష్ణ, బ్రహ్మాండలపల్లి చంద్రం, బుడిగే ఐలేని గౌడ్, స్వామిరెడ్డి, జనగం శ్రీకాంత్, దాసరి కిషన్, రాజశేఖర్ ,నరసింహులు, ఎసీ రెడ్డి మల్లారెడ్డి, శ్రీనివాస్, బద్దీ రాజు, గీస రాజయ్య,మల్లం శేఖర్, చేర్యాల నాయకులు ఉడుముల బాల్ రెడ్డి, ఉడుముల భాస్కర్ రెడ్డి, కాటం మల్లేషం, మంజె మల్లేషం, బుట్టి యాదగిరి, ఖాజా నర్మెట్ట మాజీ జెడ్పిటిసి గాదె మోహన్ రెడ్డి, జనగామ జిల్లా డిసిసి కార్యదర్శి గంగం నరసింహ రెడ్డి , కామిడి జీ వన్ రెడ్డి, బచ్చన్నపేట ఎంపీటీసీ బాలకిషన్,అమృత రెడ్డి,రామ్మోహన్ రెడ్డి,మోహన్ రెడ్డి, హరీ,సిద్దులు తరిగొప్పుల మండల నాయకులు పోతారం గ్రామ మాజీ సర్పంచ్ వగలబోయిన యాదగిరి, లూకా, పోషయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story