ఆకాశమే హద్దుగా యువత అభివృద్ధి చెందాలి: కొమ్మూరి

by Sridhar Babu |
kommuri-1
X

దిశ, జనగామ: యువత టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకుని దేశానికి ఉపయోగకరంగా మారాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామలో టీజీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి దశలో చదువుతోపాటు మానసికంగా, ఉల్లాసంగా ఉండడానికి ఇలాంటి యూత్ ఫెస్టివల్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, విద్యార్థులు ఈ దశలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, ఉద్యోగం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. నేటి యువత అందివచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. నవ సమాజ నిర్మాణంలో యువకుల పాత్ర ముఖమైనదని, సమాజంలో జరిగే ప్రతి విషయంలో యువకుల పాత్ర సమాజ హితానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. క్రీడలతో యువకుల్లో మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మీయత, సోదరభావం పెంపొందుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో యువత కొంత మేర చెడు వ్యసనాలకు బానిసై వారి యొక్క గమ్యాన్ని చేరుకోవడంలో విఫలం అవుతున్నారన్నారు. విద్యార్థులు నేటి సమాజంలో మెరుగైన వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ విద్యార్థి సంఘం నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed