- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన..?
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో ఆశావహులు జోరుగా జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అదే విషయమై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. అయితే, రేపు(ఆదివారం) కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త పీసీసీ రేసులో తన పేరు ముందుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు పీసీసీ పదవి అప్పగిస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తీసుకొస్తానని చెప్పారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్ల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.