- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి అరెస్ట్’
దిశ, న్యూస్ బ్యూరో : ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా ఉపయోగించాడని కేసులు పెట్టడం వింతగా ఉందని. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబం జీవో 111ను ఉల్లఘించి బిల్డింగ్ నిర్మాణం చేసిందా.. లేదా చెప్పకుండా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమైన చర్య అన్నారు.. జీవో 111 పరిధిలో ఉన్న భూముల్లో పేద రైతులు చిన్న చిన్న షెడ్లు వేసుకుంటే కూల్చివేసిన ప్రభుత్వాధికారలు..స్వయంగా సీఎం కొడుకు మంత్రి కేటీఆర్ చట్టాని దిక్కరించి బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే కెమెరలతో ఫోటోలు తీశారని కేసులు పెట్టడం కాదు..అక్రమంగా పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిన వాటి పై కెసులు పెట్టాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు..గోపన్ పల్లిలో అక్రమాలకు పాల్పడితే చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరపాలన్నారు.