- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను కన్నీరు పెట్టిస్తే పుట్టగతులుండవ్: కోమటిరెడ్డి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టు టీఆర్ఎస్-బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు మద్ధతుగా పోరాటం చేస్తానని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. కేసులకు భయపడి మోడీకి సరెండర్ అయ్యారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలు త్వరలోనే తెలంగాణలో కూడా వస్తాయని.. అప్పుడు రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిలబడుతోందన్నారు. టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అని చెప్పారు. రైతు బంద్‌కు మద్ధతు తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు రైతు చట్టాలను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులతో కన్నీరు పెట్టిస్తే కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Next Story