- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి సమస్యలను పరిష్కరించాలి.. ఎంపీ కోమటిరెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమల్లోకి తెచ్చిన “ధరణి పోర్టల్” తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్నా.. రైతుల పాత సమస్యలను పరిష్కరించలేదు. కానీ కొత్త సమస్యలను తెచ్చి పెట్టింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లుగా అన్నదాతల భూ వివాదాలను మరింత క్లిష్టతరం చేసిన ధరణి అభాసుపాలవుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి దాదాపుగా 11 నెలలు కావస్తోంది. ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చబడ్డ భూములను తొలగించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య లక్ష వరకు ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో రైతుల నుంచి అర్జీలు రావడంతో ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ మేరకు దృష్టిసారించిందో అర్థం కావడంలేదన్నారు. ధరణి పోర్టల్ విఫలమైందని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ౼ 22ఎలో నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చింది. 2007 నుండి ఇప్పటి వరకు రకరకాల కారణాలతో దాదాపు 20 లక్షల ఎకరాల పట్టా భూమిని నిక్షిప్తం చేసింది. వివాదరహితంగా ఉన్న పట్టా భూములకు సంబంధించిన కొన్ని వేల సర్వే నెంబర్లను కూడా రిజిస్ట్రేషన్ శాఖ తీవ్ర నిర్లక్ష్యంతో 22ఎలో చేర్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ౼ 22ఎ ను అప్ డేట్ చేయాలి. అలా చేస్తే ధరణి ద్వారా పుట్టుకొచ్చిన అనేక కొత్త సమస్యలలో దాదాపు 50% సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని భూ చట్టాల నిపుణులు, రైతుల తరపున అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.