- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటింగ్ ఎంచుకున్న రైడర్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13 సీజన్‌లో 21 మ్యాచ్ షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే 5 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది. అందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్‌ను ఢీ కొట్టగా.. మొన్న జరిగిన పంజాబ్ మ్యాచ్‌తో చెన్నై సింహాలు పంజా విసిరాయి. ఇక ఓపెనర్లు అదే ఫామ్ కొనసాగిస్తే మ్యాచ్ చెన్నై పక్షాన నిలబడక తప్పదు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన 4 మ్యాచుల్లో రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. కాగా, శుబ్ మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ తప్ప ఏ ఆటగాడు ప్రతిభ కనబర్చలేకపోవడంతో.. దినేష్ కార్తీక్ కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మ్యాచ్ ఆటగాళ్ల స్థానాలను మార్చుతారో లేదో చూడాల్సిందే. ఇక ఆండ్రూ రస్సెల్ ఇప్పటివరకు తన స్థాయికి తగ్గట్టు ఆడకపోవడం కోల్‌కతాకు మైనస్ అయింది. కనీసం ఈ రోజు మ్యాచ్‌లో అయినా రస్సెల్ విజృంభించకపోతే కోల్‌కతా విజయం ప్రశ్నార్థకంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.