- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేరింగ్-డాషింగ్ మ్యాచ్‌లో గెలుపెవరిది
దిశ, వెబ్‌డెస్క్: యూఎఈలో జరుగుతున్న ఐపీఎల్ (ipl) సమరం ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి మూడు మ్యాచ్‌లు ఎంత రసవత్తరంగా సాగాయో చెప్పనవసరం లేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) పై బోణి కొట్టిన చైన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో మ్యాచ్‌లో బోల్తా పడింది. నిన్న రాజస్తాన్ రాయల్స్ (RR) చెలరేగడంతో సీఎస్కే తోకముడిచింది.
ఇది ఇలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన ముంబై (MI) ఆటగాళ్లకు ఈ రోజు పెను సవాల్ ముందుందనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ సీజన్‌లో తనదైన ముద్ర వేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ముంబై తలపడనుంది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో విజయం ఎవరిదన్న అంశం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రైడర్స్ (KKR) చేజింగ్‌ను ఎంచుకోవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
అయితే, సీఎస్కే (CSK)తో తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యం ముందుంచకపోవడంతోనే ముంబై (MI) పరాజయం చెందిందని చెప్పాలి. దీంతో రైడర్స్ (KKR)కు భారీ టార్గెట్ ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. ముంబై (MI) డేరింగ్ బ్యాట్స్‌మెన్లు చెలరేగితే తప్ప భారీ స్కోర్ నమోదు కాదన్న మాట సత్యం. అయినా.. కోల్‌కతా (KKR)లో ఆండ్రూ రస్సెల్ ఆట తీరు అమోగం. ఎంతటీ స్కోర్‌నైనా అవలీలగా చేధించగల సత్తా అతడి సొంతం. అయితే, కీలక ఆటగాళ్ల సామర్థ్యలతో జరగబోయే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.