- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ LBW పై ముదురుతోన్న వివాదం..
దిశ, స్పోర్ట్స్ : ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అజాజ్ పటేల్ వేసిన 30 ఓవర్‌లో చతేశ్వర్ పుజార. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్లుగా వెనుదిరిగారు. అయితే 30వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు ప్రకటించారు. బ్యాటుకు బంతి తగిలిందని గ్రహించిన విరాట్ కోహ్లీ డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేలో కొన్ని మిల్లీ సెకెన్ల వ్యవధిలో బ్యాటు, ప్యాడ్లను బంతి తాకినట్లు కనపడింది. థర్డ్ అంపైర్ చాలా సార్లు వీడియో ఫుటేజీని ముందుకు వెనుకకు జరిపి చూశాడు.
టీవీల్లో చూసిన వారికి బాల్ ముందు బ్యాటును తాకినట్లే కనపడింది. అయితే థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మ మాత్రం ఈ ఫుటేజీతో తాను ఒక నిర్ణయానికి రాలేనని.. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే అమలు చేయాలని చెప్పేశాడు. దీంతో విరాట్ కోహ్లీని అంపైర్ అనిల్ చౌదరి అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ ఆశ్చర్యానికి గురయ్యాడు. అంతే కాకుండా తీవ్ర అసంతృప్తితో మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తు కాసేపు మాట్లాడాడు.
అయితే డీఆర్ఎస్‌లో కూడా తేలకపోతే మేమేమీ చేయలేమని అన్నాడు. దీంతో కోహ్లీ అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగాడు. కోహ్లీ అవుట్‌పై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ప్రపంచం అంతా కోహ్లీ నాటౌట్ అంటుంటే… కేవలం థర్డ్అంపైర్ మాత్రం దాన్ని అవుట్ అని నమ్మాడని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అంపైర్స్ కాల్‌కే కట్టుబడి ఉన్నాడు. దీంతో ప్రస్తుతం వివాదాస్పదమైన ఈ అవుట్‌పై ఇండియన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.