- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీకి రెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌లో నిరాశపరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ శారీరకంగా, మానసికంగా అలసిపోయిన విరాట్ కోహ్లీ రానున్న న్యూజిలాండ్ సిరీస్‌కి పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ తరువాత IPL, ఆ తరువాత డైరెక్ట్‌గా T20 ప్రపంచకప్ ఆడి, బయో బబుల్ సమస్యను ఎదుర్కొన్న ఆటగాళ్లు మానసికంగా కూడా అలసిపోయిన నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే T20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న కోహ్లీ, టెస్ట్, వన్డే ఫార్మాట్లలో మాత్రమే ఇక కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగనున్న T20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా, అయితే మొదటి టెస్ట్‌కు రహానే నాయకత్వం వహించనున్నాడు.
నమీబియాతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత బోర్డుని అదనపు రోజులు సెలవును కోరాడని, అయితే కోహ్లీ అభ్యర్థనని బోర్డు మంజూరు చేసిందని సమాచారం. కొంతకాలం ఫ్యామిలీతో గడపడానికి, మానసిక ఆరోగ్యం కోసం ఈ విరామం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విరామం ఎప్పటివరకు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. కానీ, డిసెంబర్ 3 నుంచి ముంబైలో జరిగే 2వ టెస్టుకు అతను జట్టులో చేరాలని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ కోహ్లీ సిరీస్‌కు దూరమైతే దక్షిణాఫ్రికా పర్యటనలో మళ్లీ జట్టులో చేరవచ్చు.
న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రోహిత్‌కే అవకాశం
- Tags
- INDvsNZ