- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైదానంలో కోహ్లీ తిరుగులేని శక్తి: బ్యాటింగ్ కోచ్
దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఒకవైపు ఉంటే, మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా మరోవైపు ఉంటారని, అతడు మైదానంలో ఒక తిరుగులేని శక్తి అని టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసించాడు. ఒక క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ‘కోహ్లీకి ఆటపట్ల ఉన్న కమిట్‌మెంట్ చాలా గొప్పది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలని నిరంతరం కష్టపడుతుంటాడు. ఆ నిబద్ధతే ఈ రోజు అతడిని ఉన్నత స్థానంలో ఉంచింది. నేను చూసిన హార్డ్ వర్కింగ్ క్రికెటర్ కొహ్లీనే. అతనికి ఉన్న అనుకూలతలే అతడి బలం. అతను ప్రతిసారీ ఒకేలా ఆడే బ్యాట్స్‌మ్యాన్ కాదు. పరిస్థితులను బట్టి బ్యాటింగ్ శైలిని మారుస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ప్రతిభ అతడిలో ఉంది’ అని విక్రమ్ రాథోడ్ చెప్పాడు. ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడటం కొహ్లీకి ఉన్న అతిపెద్ద బలమని రాథోడ్ వెల్లడించాడు.